లారెన్స్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ ని డైరెక్ట్ చేస్తున్నాడంటూ వార్తలొస్తున్నాయ్. హారర్ కామెడీల స్పెషలిస్టుగా పేరున్న లారెన్స్ తన ఫార్ములాని బాలీవుడ్ కి ఎగుమతి చేస్తున్నాడు. అక్కడ కిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా `కాంచన` `ముని` చిత్రాల్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆ మేరకు చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఇది రీమేక్ కాదు. కాంచన ముని చిత్రాల్ని కలిపి తీసే ఓ హారర్ కామెడీ చిత్రమని మేకర్స్ చెబుతున్నారు. అంటే అక్షయ్ కుమార్ దెయ్యం పాత్రలో నటించబోతున్నారన్నది మాత్రం కన్ఫర్మ్ . కాంచన కథలో హిజ్రా(శరత్ కుమార్) ఆత్మ లారెన్స్ లో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఎంతో ఉత్కంఠగా తెరకెక్కించడంలో లారెన్స్ పనితనానికి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. అందుకే అక్షయ్ సైతం ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారట. ఈ చిత్రాన్ని 2020 లోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. తొలిగా ఆర్నెళ్ల పాటు స్క్రిప్టు వర్క్ చేస్తారట. అటుపై ఈ ఏడాది జూన్- జూలైలో సినిమాని ప్రారంభించి ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలన్నది ప్లాన్.